News March 15, 2025
MBNR: GOOD NEWS.. APPLY చేసుకోండి.!

బీసీ స్టడీ సర్కిల్లో బ్యాంకింగ్ & ఫైనాన్స్‌లో ఒక నెల నాన్ రెసిడెన్షియల్ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.స్వప్న తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్‌కు చెందిన అర్హులైన బీసీ అభ్యర్థులు ఈనెల 15 నుంచి ఏప్రిల్ 8లోగా సంబంధిత వెబ్ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, ఏప్రిల్ 12న MBNRలో ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందన్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్‌మెంట్ కల్పిస్తామన్నారు.
Similar News
News March 18, 2025
NGKL: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

ఏడేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను తల్లిదండ్రులు సమీప బంధువు ఇంటి వద్ద విడిచి పనులమీద బయటికెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 14న బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక ద్వారా తల్లిదండ్రులు తెలుసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
News March 18, 2025
MBNR: 16 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనులు: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లావ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున 16 గ్రామాలను ఎంపిక చేశామని అక్కడ వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయో నివేదిక పంపించాలని ఆమె ఆదేశించారు.
News March 18, 2025
MBNR: తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టండి: కలెక్టర్

వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె ఛాంబర్‌లో తాగునీరు, విద్యుత్ సమస్యపై సమీక్షించారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా విద్యుత్ సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు.