News March 15, 2025

MBNR: GOOD NEWS.. APPLY చేసుకోండి.!

image

బీసీ స్టడీ సర్కిల్లో బ్యాంకింగ్ & ఫైనాన్స్‌లో ఒక నెల నాన్ రెసిడెన్షియల్ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.స్వప్న తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్‌కు చెందిన అర్హులైన బీసీ అభ్యర్థులు ఈనెల 15 నుంచి ఏప్రిల్ 8లోగా సంబంధిత వెబ్ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, ఏప్రిల్ 12న MBNRలో ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందన్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్‌మెంట్ కల్పిస్తామన్నారు.

Similar News

News February 2, 2026

MBNR: మున్సిపల్ ఎన్నికలు.. SP సమీక్ష

image

మహబూబ్‌నగర్ జిల్లా నందు జరగనున్న మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, భూత్పూర్ మున్సిపల్, దేవరకద్ర మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలపై దృష్టి సారించింది. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఎస్పీ ఛాంబర్‌లో ఎస్పీ డి.జానకి సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

News February 2, 2026

పాలమూరు: ఇక ప్రచారంపై పూర్తి ఫోకస్..!

image

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. గెలుపే లక్ష్యంగా తమ మద్దతుదారులతో కలిసి వ్యూహాలకు పదును పెడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 3 వరకు గడువు ఉండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు.

News February 2, 2026

MBNR: గండీడ్ వికారాబాద్‌లో కలిసేనా?

image

గండీడ్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలపాలని స్థానికులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇప్పటికే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ మండలం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. కానీ వికారాబాద్ సరిహద్దులో ఉంటూ అభివృద్ధి కోసం, పాలనా సౌలభ్యం కోసం జిల్లా మార్పు ఆవశ్యకమని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.