News October 3, 2024
MBNR: KCR.. వాళ్లని కంట్రోల్ చేయ్: MP

HYD ప్రజల క్షేమం, భద్రత కోసమే హైడ్రా, మూసీ ఆపరేషన్లు స్టార్ట్ చేశామని NGKL కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తమ ప్రభుత్వం రూ.కోట్లు కొల్లగొడుతోందని KTR, హరీశ్ రావు ఆరోపణలు అర్థరాహిత్యమని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తే HYD అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం మాట్లాడుతున్న KTR, హరీశ్ రావును KCR కంట్రోల్ చేయాలని, రాష్ట్ర భవిష్యత్తును వీళ్లు అడ్డుకుంటున్నారన్నారు.
Similar News
News December 26, 2025
MBNR: నేడు వార్షిక నేర నివేదిక విడుదల

మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డి.జానకి సమావేశం నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ రిలేషన్స్ అధికారి (పీఆర్ఓ) శ్రీనివాసులు “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 వార్షిక నేర నివేదిక (Annual Crime Review) అన్యువల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మీడియా ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.
News December 25, 2025
MBNR: రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్.. రన్నర్‌గా పాలమూరు

రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ మెదక్‌లోని మనోహరాబాద్‌లో నిర్వహించారు. ఈ టోర్నీలో మహబూబ్‌నగర్ బాలికల జట్టు రన్నర్స్ (2వ స్థానం)లో నిలిచిందని జిల్లా సాఫ్ట్ బాల్ అధ్యక్షుడు అమరేందర్ రాజు ‘Way2News’ప్రతినిధితో తెలిపారు. బాలికల విజయం పట్ల సంఘం సభ్యులు రాఘవేందర్, నాగరాజు, ఉమ్మడి జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు. కోచ్, మేనేజర్‌గా లక్ష్మీనారాయణ, సునీత వ్యవహరించారు.
News December 25, 2025
MBNR: ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

బాలానగర్ మండలం పెద్దాయపల్లి చౌరస్తా సమీపంలో నారాయణపేట జిల్లా మరికల్ స్కూల్ బస్సు అదుపుతప్పి కింద పడ్డ సంఘటన తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ డి.జానకి ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానిక ఎస్సై లెనిన్ ప్రమాద సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


