News March 17, 2024
MBNR: ఆలయాల్లో ధర్మకర్తల మండళ్లు ఏర్పాటుపై ఎదురుచూపులు

ఉమ్మడి జిల్లాలో అనేక ఆలయాల్లో ధర్మకర్తల మండళ్లు పనిచేయటం లేదు. పదవీ కాలం పూర్తయి నెలలు గడుస్తున్న కొత్త కమిటీల ఏర్పాటు రూపుదాల్చడం లేదు. జనవరిలో ట్రస్ట్ బోర్డుల నియామకానికి దేవాదాయ శాఖ ప్రకటన జారీ చేయగా ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల నియామక ప్రక్రియ ఆగిపోయింది. దీంతో పాలకమండలి సభ్యుల పదవీ కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు నిరాశలో పడ్డారు. ఉమ్మడి జిల్లాలో దేవాదాయశాఖలో మొత్తం 1340 ఆలయాలు ఉన్నాయి.
Similar News
News January 25, 2026
MBNR: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్

ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాల కోసం 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కరపత్రాలను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. గత రెండేళ్లలో ఇక్కడి విద్యార్థులు 94 ఉద్యోగాలు సాధించారని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. డిగ్రీ అర్హత కలిగిన SC, ST, BC అభ్యర్థులు ఈనెల 30లోగా www.tsstudycircle.co.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
News January 24, 2026
మహబూబ్నగర్: విద్యుత్ సమస్యలకు చెక్

మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో ఉన్న మొక్కలను తొలగిస్తున్నామని ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ భీమా నాయక్ తెలిపారు. తిరుమలాపూర్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్నామన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని పలువురు ఎస్ఈకి ఫిర్యాదు చేయగా పనులు చేపట్టామని చెప్పారు.
News January 23, 2026
గంగాపురం జాతరకు ప్రత్యేక బస్సులు

గంగాపురంలో కొలువైన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ సంతోశ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారికి సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా టెంట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.


