News August 3, 2024
MBNR: LRS ప్రక్రియను మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయాలి: డీప్యూటీ సీఎం
రాష్ట్ర వ్యాప్తంగా క్రమబద్దీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న LRS ప్రక్రియను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయాలని డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భూపాలపల్లి కలెక్టరేట్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. గద్వాల నుంచి కలెక్టర్ సంతోష్ వీసీలో పాల్గొన్నారు.
Similar News
News September 7, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!
✔శ్రీశైలం డ్యామ్..8 గేట్ల ఎత్తివేత
✔NGKL:బొలెరో వాహనం ఢీకొని చిన్నారి మృతి
✔దౌల్తాబాద్:అప్పుడే పుట్టిన శిశువుని పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు
✔పలుచోట్ల వర్షం.. సజావుగా రాకపోకలు
✔ఉమ్మడి జిల్లాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
✔NRPT:10న అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక
✔పలుచోట్ల మట్టి విగ్రహాలు పంపిణీ
✔ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోండి:SIలు
News September 7, 2024
SDNR: దొంగతనం చేస్తుంటే చూశాడని బాలుడి హత్య
షాద్‌నగర్ పట్టణ సమీపంలోని హాజీ పల్లి రోడ్డులో ఎల్లయ్య అనే వ్యక్తి దొంగతనం చేస్తుండగా ఆరేళ్ల బాలుడు చూశాడు. ఈ విషయం ఎవరికైనా చెబుతాడేమోనని భయంతో ఎల్లయ్య అనే వ్యక్తి బాలుని బండకేసి బాధడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి తల పూర్తిగా చిక్కిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
News September 7, 2024
MBNR: ఉమ్మడి జిల్లాలో ఈ మండలాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా!
ఉమ్మడి జిల్లాలో నిరక్షరాస్యుల సంఖ్య 2011లో 7,78,184 ఉండగా ఇప్పుడు 10 లక్షలు దాటింది. GDWLలో కేటీదొడ్డి, గట్టు, ధరూర్, NRPTలోని దామరగిద్ద, మద్దూరు, కోస్గి, NGKLలోని బిజినేపల్లి, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, అచ్చంపేట, మన్ననూరు, అమ్రాబాద్, పదర, WNPTలో ఖిల్లాఘణపూర్, పెద్దమందడి, MBNRలో కోయిలకొండ, గండీడ్, బాలన గర్ మండలాల్లో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవంగా ప్రత్యేక కథనం.