News March 29, 2024
MBNR: MLC ఉప ఎన్నికలు.. గైర్హాజరు అయింది వీళ్లే!

మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 1,439 ఓట్లకు, 1,437 మంది సద్వినియోగం చేసుకున్నారు. ఇద్దరూ తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంథన్ గోడు బీజేపీ ఎంపీటీసీ సభ్యురాలు సుమిత్ర అనారోగ్యం కారణంగా, నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గుడ్ల సర్వ ఎంపీటీసీ సభ్యురాలు శారద అమెరికాలో ఉండటంతో ఓటుహక్కును వినియోగించుకోలేదు.
Similar News
News April 10, 2026
MBNR: పెరుగుతున్న ఎండలు.. ప్రజల బెంబేలు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో 41.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. భూత్పూర్ మండలం కొత్త మొల్గర 40.7, కౌకుంట్ల 40.6, భూత్పూర్ 40.3, నవాబుపేట 45.2, చిన్న చింతకుంట 40.0, మూసాపేట మండలం జానంపేట 39.7, అడ్డాకుల, మహమ్మదాబాద్, దేవరకద్ర 39.6, మిడ్జిల్ మండలం దోనూరు, మహబూబ్ నగర్ గ్రామీణం 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News April 9, 2026
MBNR: రహదారి భద్రతపై రాష్ట్రస్థాయి సమీక్ష

రాష్ట్ర CS కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి గురువారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. “అర్రైవ్ అలైవ్” కార్యక్రమం అమలు, దాని సిద్ధతపై ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఎస్పీ డి.జానకి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల్లో అవగాహన కల్పించే అంశాలపై చర్చించారు.
News April 9, 2026
సిరి వెంకటాపూర్‌లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం సిరి వెంకటపూర్‌లో 41.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. నవాబుపేట 40.8, మహమ్మదాబాద్ 40.6, కౌకుంట్ల 40.5, చిన్న చింతకుంట 40.3, భూత్పూర్ 40.0, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 39.8, మిడ్జిల్ మండలం దోనూరు, మూసాపేట మండలం జానంపేట 39.6, మహబూబ్‌నగర్ అర్బన్ 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


