News August 19, 2024
MBNR: NCC కవాతు గుర్రాలు చోరీ
మహబూబ్‌నగర్‌లోని స్థానిక జయప్రకాష్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో NCC కవాతు కోసం ఉపయోగించే రెండు గుర్రాలను ఆదివారం అర్ధరాత్రి చోరీ గురయ్యాయి. కళాశాలలో మొత్తం నాలుగు గుర్రాలు ఉండగా రెండు గుర్రాలు దుండగులు అపహరించారు. కళాశాల సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీలు పరిశీలించగా గుర్తుతెలియని ఇద్దరు దండగులు చోరీ చేసినట్లు గుర్తించారు.
Similar News
News September 13, 2024
వరద భాదితులకు జితేందర్ రెడ్డి రూ.కోటి విరాళం
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ జితేందర్ తన వంతుగా సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళం ఇచ్చారు. సుదర్శన్ రెడ్డి, ఏపీ మిథున్ రెడ్డి, ఏపీ సంజయ్ రెడ్డితో కలిసి సచివాలయంలో సీఎంకు చెక్కును అందజేశారు. ఇటీవల తెలంగాణలో సంభవించిన వరదలు తనను ఎంతగానో కలిచివేశాయని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు మేలు చేసేందుకు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తాయని అన్నారు.
News September 13, 2024
సిపిఎం నేత లక్ష్మీదేవమ్మ కన్నుమూత
ఉమ్మడి జిల్లా సిపిఎం పార్టీలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. మరి జిల్లా సిపిఎం పార్టీలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకురాలు లక్ష్మీదేవమ్మ(70) మరణించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన అనేక కార్మిక ఉద్యమాల్లో లక్ష్మీ దేవమ్మ చురుకుగా పాల్గొన్నారు. మహిళ ఉద్యమాల నిర్మాణంలోనూ లక్ష్మీ దేవమ్మ చురుకైన పాత్ర పోషించారు. లక్ష్మీ దేవమ్మ మృతి పట్ల సిపిఎం నాయకులు సంతాపం తెలిపారు.
News September 13, 2024
అలంపూర్: చాలాకాలం తరువాత గుర్తించారు..!
అలంపురంలోని బాల బ్రహ్మేశ్వర ఆలయం లో ఉన్న ద్వారపాలకుల విగ్రహానికి ఈఓ పురేందర్ కుమార్ రంగులు వేయిస్తున్నారు. 60ఏళ్ల క్రితం కళ్ళే రంగస్వామి(కుంటి రంగస్వామి)అనే స్థానిక కళాకారుడు ఈ ద్వారపాలకుల విగ్రహాలను స్వయంగా చేశారు. మంచి రూపలావణ్యం కలిగిన విగ్రహాలను భక్తులు గుర్తించలేకపోతున్నారంటూ ఈవో వాటికి పేయింటింగ్ చేయించారు. ఇంతకాలానికి గుర్తించినందుకు ధన్యవాదాలంటూ కళ్లె వంశీయులు రంగ అన్నారు.