News March 22, 2024

MBNR, NGKLలో మొదలైన ఎన్నికల సందడి..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా MP ఎన్నికల సందడి మొదలైంది. నిన్న సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలైంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్-12, BRS- 2 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాయి. ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ బలంగానే కనిపిస్తోంది. లోక్ సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.

Similar News

News December 17, 2025

MBNR జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే.!

image

పాలమూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలి ఫలితం వెలువడింది. భూత్పూర్ మండలం లంబాడికుంట తండా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాన్య నాయక్ ఘనవిజయం సాధించారు. BRS మద్దతుతో పోటీ చేసిన ఆయన, ప్రత్యర్థులపై ఆధిక్యం కనబరిచి విజేతగా నిలిచారు. జిల్లాలో వెలువడిన మొదటి ఫలితం ఇదే కాగా అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. గ్రామంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

News December 17, 2025

MBNR జిల్లాలో 81.44 శాతం ఓటింగ్.. లెక్కింపు ప్రారంభం

image

MBNR జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి జిల్లా వ్యాప్తంగా 81.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 1,16,379 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ముగిశాయి. మ.2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సా.5 గంటల వరకు ఫలితాలు వెలువడనున్నాయి.

News December 17, 2025

మహబూబ్‌నగర్‌లో 25% ఓటింగ్ నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు మండలాల్లో మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 25 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. మొత్తం 1,42,909 మంది ఓటర్లకు గాను 36,232 మంది తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకున్నారు. ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.