News May 9, 2024
MBNR, NGKLలో కొత్త ఓటర్లు వీరే..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024 ఓటర్ల జాబితాకు అదనంగా కొత్త ఓటర్లను చేర్చి ఎన్నికల అధికారులు తుది జాబితాను ప్రకటించారు. MBNR లోక్ సభ పరిధిలో 2,977 మంది పురుషులు, 8385 మంది స్త్రీలు, 3 ఇతరులు కలిపి మొత్తం 15,274 మంది.. NGKL లోక్ సభ నియోజకవర్గంలో 2501 మంది పురుషులు, 4585 మంది మహిళలు, ఇతరులు ఇద్దరు కలిపి మొత్తం 7,538 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 8, 2025
మహబూబ్‌నగర్‌లో యువతిపై అత్యాచారం.. కేసు నమోదు
యువతిపై అత్యాచార ఘటన MBNRలో చోటుచేసుకుంది. సీఐ ఇజాజుద్దీన్ వివరాల మేరకు.. స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ యువతి తనపై అత్యాచారం జరిగిందని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 31 వేడుకల్లో అదే ఆసుపత్రిలో పనిచేసే ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు అందులో పేర్కొంది. యువతి ఇరవై రోజుల కిందట విధుల్లో చేరినట్లు తెలిసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
News January 8, 2025
మహబూబ్‌నగర్‌లో తాత్కాలికంగా పలు రైళ్ల రద్దు
మహబూబ్‌నగర్ జిల్లాలో రైల్వే పనుల మరమ్మతుల కారణంగా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లా మీదుగా సికింద్రాబాద్ – కర్నూల్ సిటీ తుంగభద్ర రైలు కర్నూలు – గద్వాల మధ్య పట్టాల మరమ్మతుల కారణంగా ఈ రైలు గద్వాల వరకు మాత్రమే నడవనుంది. కాచిగూడ – MBNR రైలు షాద్‌నగర్ వరకు మాత్రమే నడవనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరుతున్నారు.
News January 8, 2025
MBNR: క్రీడల్లో నిబంధనలు నామమాత్రమేనా?
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,227 ప్రభుత్వ పాఠశాలలుంటే 3.50 లక్షల మంది విద్యార్థులు, 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా..17,500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో 275 మంది PEDలు, 45 మంది PETలు మాత్రమే ఉన్నారు.250 మంది విద్యార్థులకు ఒక పీఈటీ ఉండాలన్న నిబంధన నామమాత్రమే. ప్రభుత్వం క్రీడలపై దృష్టి పెట్టి వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు కోరుతున్నారు.