News April 30, 2024
MBNR, NGKL స్థానాల్లో రెండో బ్యాలెట్ యూనిట్ల ఏర్పాటు
నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం పూర్తికావడంతో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం గుర్తులు కేటాయించారు. EVMలో 15మంది అభ్యర్థులతోపాటు నోటా ఉంటుంది. నోటాతో కలిపి మొత్తం అభ్యర్థుల సంఖ్య 16 కాగా… MBNR, NGKL పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల సంఖ్య 16 దాటడంతో ప్రతి పోలింగ్ బూత్లో రెండో బ్యాలెట్ యూనిట్ ఏర్పాటు కోసం అధికారులు సిద్ధమవుతున్నారు.
Similar News
News January 2, 2025
బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు కృష్ణ మనోహర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా కృష్ణ మనోహర్ గౌడ్ చేసిన సేవలను గుర్తించి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నియమించినట్లు నరేందర్ గౌడ్ వెల్లడించారు.
News January 2, 2025
అమరచింత: నిలిచిన జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నందు గురువారం ఇన్ఫ్లోనిలిచిపోయింది. దీనితో వచ్చే జూన్ వరకు వర్షాలు లేకపోవడంతో తాగునీటికి కష్టాలు తప్పేటట్లు లేదు. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 9.657 టీఎంసీలు, ప్రస్తుత నిల్వ 4.091 టీఎంసీలు, ఆవిరి ద్వారా 29 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 550, కుడి కాలువకు 500, మొత్తం అవుట్ స్లో 342 క్యూసెక్కులు వెళ్తున్నట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ వెంకటేశ్వరరావు వివరించారు.
News January 2, 2025
MBNR: స్థానిక పోరు.. ఏర్పాట్లు షురూ
మహబూబ్ నగర్ జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికలకు వ్యాప్తంగా అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి 12 మంది అధికారులను నియమిస్తూ కలెక్టర్ విజయేందిర ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 441 గ్రామ పంచాయతీల్లో 3,836 వార్డులు ఉన్నాయి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా.. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ఓటర్లు మొత్తం 5,27,302 మంది ఉన్నారు.