News March 23, 2024

MBNR, NGKL అభ్యర్థుల ఖరారు.. ఇక వ్యూహాలపై కసరత్తు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల ప్రధాన పార్టీల లోక్ సభ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. విజయం కోసం ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్, BJP, BRS పార్టీల ఎంపీ అభ్యర్థులు ఎవరో తేలడంతో ఉత్కంఠకు తెరపడింది. స్థానికంగా సమీకరణాలు శరవేగంగా మారుతున్న తరుణంలో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే పలువురు నేతలు గ్రామాల వారిగా ప్రచారంలో నిమగ్నమయ్యారు.

Similar News

News September 8, 2025

MBNR: 3,000 విగ్రహాల నిమజ్జనం ప్రశాంతం: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,000 విగ్రహాలను నిబంధనల ప్రకారం వివిధ చెరువులు, శివార్లలో నిమజ్జనం చేశారని ఆమె చెప్పారు. కొద్ది రోజులుగా భక్తిశ్రద్ధలతో జరిగిన గణేశ్ ఉత్సవాలు, అనంతరం నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముగిశాయని పేర్కొన్నారు.

News September 6, 2025

జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

జడ్చర్ల పట్టణంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఎంబీ చర్చ్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న ప్రమోద్(25) అక్కడికక్కడే మరణించాడు. మరో యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 6, 2025

పాలమూరులో మైక్రో బ్రూవరీలకు అనుమతి

image

MBNR జిల్లాలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. వెయ్యి గజాల స్థలంలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని, తయారైన బీర్లను అక్కడే విక్రయించాలని సూచించారు. 36 గంటల్లోగా అమ్ముడుపోని బీర్లను పారేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. అనుమతి పొందిన వారు ఆరు నెలల్లోగా యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.