News May 5, 2024

MBNR, NGKL ఎంపీ బరిలో ఏడుగురు మహిళలు

image

లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడుగురు మహిళలు పోటీలో ఉన్నారు. MBNR నుంచి డీకే అరుణ, గోవిందమ్మ, విజయ, సరోజనమ్మ బరిలో నిలవగా.. NGKL నుంచి బర్రెలక్క(కర్నె శిరీష), గీత, భారతి పోటీలో ఉన్నారు. కాగా వీరిలో శిరీష(స్వతంత్ర) అత్యంత పిన్న వయస్సు(25) కాగా.. డీకే అరుణ(BJP) ఎక్కువ వయస్సు(64) ఉన్న అభ్యర్థులుగా ఉన్నారు.

Similar News

News January 5, 2025

షాద్‌నగర్: మద్యం అమ్మితే.. రూ.50 వేల జరిమానా

image

షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్‌నగర్ మండలం చించోడ్ గ్రామస్థులు శనివారం ప్రజల శ్రేయస్సు కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యం అమ్మితే రూ.50 వేలు, మద్యం కొంటే రూ.25 వేలు, పేకాట ఆడితే రూ.50 వేల జరిమానా విధిస్తూ ఓ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

News January 5, 2025

MBNR: పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ

image

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల బాత్ రూంలో సెల్‌ఫోన్ కెమెరా పెట్టిన ఘటనపై జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకీతో కలిసి కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపల్, విద్యార్థినులతో మాట్లాడారు. ఘటనపై ప్రిన్సిపల్ పోలీస్ శాఖకు సమాచారం అందించడంతో కెమెరా పెట్టిన విద్యార్థిని అరెస్టు చేశారు. విద్యార్థుల భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News January 5, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి
✔MBNR: గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు..నిందితుడి పై కేసు నమోదు
✔కార్మికులపై అణచివేత విధానాలు మానుకోవాలి:CITU
✔జూరాల ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి సామర్థ్యం
✔’Way2News’తో శ్రీరంగాపూర్ గ్రామ సెక్రెటరీ
✔PU క్రీడాకారులు ప్రతిభ కనబరచాలి: వీసీ
✔కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
✔CMRF చెక్కుల పంపిణీ
✔పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యేలు