News June 5, 2024

MBNR, NGKL: నోటాకు 9,299 ఓట్లు

image

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో నోటాకు ఆదరణ తగ్గింది.  మహబూబ్‌నగర్‌లో4330, నాగర్‌కర్నూల్‌లో4969 ఓట్లు మాత్రమే నోటాకు పడ్డాయి. ఈ 2 లోక్ సభ స్థానాల్లో కలిపి 2014లో 21,425 ఓట్లు, 2019లో 24,125 ఓట్లు, 2024లో 9,299 నోటాకు పోలయ్యాయి. 2019తో పోల్చితే ఈ సారి నోటాకు 14,826 ఓట్లు తక్కువగా వచ్చాయి. నోటాకు ఆదరణ తగ్గిందనడానికి తక్కువ ఓట్లు నమోదు కావడం గమనార్హం.

Similar News

News January 12, 2025

MBNR: విద్యా నిధికి రూ.4,95,211 సాయం

image

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యా నిధి పథకానికి స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి రూ.4,95,211ల చెక్కు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి శనివారం సాయంత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాల కన్నా విద్యాదానం ఎంతో గొప్పదని అన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మహబూబ్ నగర్ రుణం తీర్చుకునే ఆకాశం వచ్చిందని అన్నారు.

News January 11, 2025

MBNR: ‘సంక్రాంతికి ఊరికెళ్తున్నారా.? ఇది మీకోసమే.!’

image

✓ విలువైన వస్తువులు, నగదు, నగలు ఇంట్లో ఉంచకపోవడం మంచిది.✓ ఊరికి వెళ్తున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టకండి.✓ ఇంటి ఆవరణలో లేదా ఏదైనా గదిలో లైటు వేసి ఉంచండి.✓ నమ్మకమైన వ్యక్తిని వాచ్‌మెన్‌గా పెట్టుకోవడం మంచిది.✓ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని వాటికి మొబైల్ అనుసంధానం చేసుకోవాలి.✓ ఇంటితాళం బయటకు కనిపించకుండా చూసుకోండి.✓ ఊరికి వెళ్లేముందు పోలీస్ స్టేషన్‌లో తెలపడం ఉత్తమం.

News January 11, 2025

MBNR: కురుమూర్తి స్వామి గిరి ప్రదక్షిణ.. హాజరైన భక్తులు

image

కురుమూర్తి స్వామి దేవాలయంలో ఈ ఏడాది నుంచి కొత్తగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు. దేవాలయ చరిత్రలో తొలిసారిగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ పూజారులు తెలిపారు. తొలిసారి నిర్వహించిన స్వామి వారి గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.