News October 7, 2025

MBNR: PUలో ప్లేస్‌మెంట్ డ్రైవ్.. PRESS MEET.!

image

పాలమూరు యూనివర్సిటీలో ఈనెల 11న ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ VC జిఎన్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, BDMAI ఒప్పందం ఆధారంగా 320 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, ఉమ్మడి జిల్లాలోని ఆసక్తిగల పురుష అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. https://forms.gle/ctBZNQ1ByU5B6xKB6
SHARE IT.

Similar News

News October 8, 2025

బీచ్ సందర్శకుల రక్షణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

పేరుపాలెం, కేపీపాలెం బీచ్ సందర్శకుల రక్షణకు ముందస్తు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో బీచ్ సందర్శకుల రక్షణ ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని బీచ్‌ల సందర్శకులు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోకుండా అవసరమైన ముందస్తు చర్యలను సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షించారు. జిల్లా ఎస్పీ నయీం ఉన్నారు.

News October 8, 2025

NZB: నేడే తీర్పు.. జిల్లాలో ఉత్కంఠత

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో మొత్తం 31 ZPTCలు, 307 MPTC స్థానాలు ఉండగా మండలాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించగా అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

News October 8, 2025

ADB: మూఢ నమ్మకాలకు ఆజ్యం పోస్తున్న ఆకతాయిలు

image

సాంకేతికత రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నా ప్రజలను మూఢనమ్మకాలు గాఢాంధకారంలోకి నెట్టేస్తున్నాయి. పౌర్ణమి అమావాస్య రోజుల్లో కొందరు ఆకతాయిలు రోడ్లపై నిమ్మకాయలు పసుపు కుంకుమ వంటివి వేసి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా జిల్లాలో పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారులు ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తే ఇలాంటి భయం లేకుండా ఉంటుందని భౌతిక వాదులు పేర్కొన్నారు.