News October 15, 2025
MBNR: PUలో 4వ స్నాతకోత్సవం.. నిబంధనలు ఇవే!

✒PhD అవార్డు, బంగారు పతక గ్రహీతలను మాత్రమే గ్రంథాలయం ఆడిటోరియంలోనికి అనుమతి
✒బంగారు పతక విజేతలు, తల్లిదండ్రులకు ప్రవేశ పాసులు జారీ
✒విద్యార్థుల తల్లిదండ్రులు, PU సిబ్బందికి, మేనేజ్మెంట్ సభ్యులకు ప్రత్యక్షంగా వీక్షేందుకు ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లు
✒విద్యార్థులు, ఇతరులు ఇండోర్ కాంప్లెక్స్‌లో డిజిటల్ తెరపై చూసే వెసులుబాటు
✒ఫొటోలు, సెల్ఫీ పాయింట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
Similar News
News October 15, 2025
₹13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

AP: PM మోదీ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ₹13వేల కోట్ల పనులలో కొన్నింటిని పీఎం ప్రారంభిస్తారని, మరికొన్నింటికి శంకుస్థాపన చేస్తారని CM CBN తెలిపారు. ‘గత పాలకుల తప్పిదాలతో రాష్ట్రం చాలా నష్టపోయింది. వాటిని సరిదిద్దేందుకే చాలా టైం పట్టింది. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులొస్తున్నాయి. కూటమితో APని మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దుదాం. PM సభను విజయవంతం చేయాలి’ అని కోరారు.
News October 15, 2025
HYD: తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలకు 11 మంది ఎంపిక

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో 2023 సంవత్సరానికి సాహితీ పురస్కారాలకు 11 మంది ఎంపికైనట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. ఈనెల 29న నాంపల్లి ప్రాంగణంలో ఈ పురస్కారాలు ప్రధానం చేస్తామని, పురస్కారాల గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ. 20,116 నగదు అందజేసి సత్కరిస్తామన్నారు. 2020, 2021, 2022 సంవత్సరాల్లో వెలువడ్డ పుస్తకాలను సేకరించి పురస్కారాల ఎంపిక చేసామన్నారు.
News October 15, 2025
HYD: ఎన్నికల వేళ.. జ్యోతిషులు ఫుల్ బిబీ

ఎన్నికలకు సమయం దగ్గరకు వచ్చేకొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ ఎక్కువైంది. ఇంకా నామినేషన్ వేయకముందే వారిలో ఒకరకమైన ఆందోళన.. అందుకే ఎలాంటి ఇబ్బందులు రాకుండా తమకు ఏ రోజు మంచిదో చూసుకొని నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకే సిటీలో పంచాంగ కర్తలు, జ్యోతిషులు బిబీ.. బిజీగా మారారు. పేరు, పుట్టిన తేదీ, జన్మ నక్షత్రం ప్రకారం జాతకం చూస్తూ ఎప్పుడు నామినేషన్ వేయాలో, ఏమేం పూజలు చేయాలో చెబుతున్నారు.