News April 5, 2025
MBNR: PU నివేదిక ఇవ్వండి: CM

విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దే కోర్సులు ఉండాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐసీసీసీలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జి.ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు. అవసరమైన నిధుల, భవనాల నియామకాలపై నివేదిక ఇవ్వాలన్నారు.
Similar News
News January 6, 2026
ALERT.. చైనా మాంజా.. సమాచారం ఇవ్వండి: MBNR SP

ప్రజల ప్రాణాల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని, చైనా మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా కఠిన చర్యలు చేపడుతున్నట్లు మహబూబ్నగర్ ఎస్పీ జానకి తెలిపారు. ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించి చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా మానేయాలని, ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
News January 5, 2026
పాలమూరు: BRS మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటన

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను మంగళవారం ఉదయం 9:00 గంటలకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ముందుగా జూరాల ప్రాజెక్టు, ఎడుమ, కుడి కాలువలను పరిశీలించనున్నారు. అనంతరం రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా సందర్శించనున్నారు.
News January 5, 2026
MBNR: పీయూ.. ఈనెల 7న క్రికెట్ ఎంపికలు

పాలమూరు యూనివర్సిటీ పురుషుల, స్త్రీల క్రికెట్ జట్ల ఎంపికలు ఈనెల 7న MBNRలోని ‘MDCA’ మైదానంలో జరగనుంది. సౌత్ జోన్ ఆలిండియా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు PD డా.వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ముఖ్యఅతిథిగా VC ప్రొ. జీఎన్.శ్రీనివాస్ హాజరుకానున్నారు. 17-25 ఏళ్ల లోపు వయసున్న క్రీడాకారులు అర్హులని, ఆసక్తి గల వారు బోనఫైడ్పై ప్రిన్సిపల్ సంతకంతో హాజరుకావాలని సూచించారు.


