News April 3, 2024

MBNR: SSC రాశారా.. ఇది మీ కోసమే!

image

ఇటీవల పదో తరగతి వార్షిక పరీక్షలు ముగియడంతో విద్యాశాఖ అధికారులు బుధవారం నుంచి పేపర్ మూల్యాంకనం చేపట్టనున్నారు. ఈ మేరకు MBNR, గద్వాల, నారాయణపేట జిల్లాలకు సంబంధించిన పేపర్లను పాలమూరులోని గ్రామర్ స్కూల్లో వాల్యుయేషన్ చేయనున్నారు. మొత్తం 2.30 లక్షల పేపర్ల వాల్యుయేషన్ కోసం 800 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 150 చీఫ్ ఎగ్జామినర్లు, 260 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. SHARE IT

Similar News

News December 11, 2025

సల్కర్‌పేటలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో గత 24 గంటల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. గండీడ్ మండలం సల్కర్ పేట 8.3 డిగ్రీలు, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 9.4, బాలానగర్ 9.5, రాజాపూర్ 9.8, భూత్పూర్ 9.9, మహమ్మదాబాద్ 10.4, కౌకుంట్ల 10.7, కోయిలకొండ మండలం పారుపల్లి, మూసాపేట మండలం జానంపేట10.8, దేవరకద్ర, మిడ్జిల్ మండలం దోనూరు 10.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది.

News December 11, 2025

మహబూబ్‌నగర్ గ్రామాల్లో ఉత్కంఠ.. ఓటేసేందుకు రెడీనా?

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు మండలాల్లో నేడు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. గండీడ్, రాజాపూర్, మహమ్మదాబాద్, నవాబ్‌పేట, మహబూబ్‌‌నగర్ రూరల్ మండలాల్లోని 139 పంచాయతీల్లో అభ్యర్థుల భవిత్యం తేలనుంది. ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఉ. 7 నుంచి మ. 1గంట వరకు జరగనుండగా.. మ. 2గంటల నుంచి ఫలితాలు వెల్లడికానున్నాయి. మరి ఓటేసేందుకు రెడీనా?

News December 10, 2025

MBNR: పల్లె బాట పట్టిన పట్టణవాసులు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో రేపు గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదు, ముంబై వలస వెళ్లిన కార్మికులు తిరిగి తమ సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులలో రద్దీ గణనీయంగా పెరిగింది. కొందరు సొంత వాహనాలతో తమ గ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. దీంతో 44వ జాతీయ రహదారి రద్దీగా మారింది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.