News January 3, 2026
MBNR: SSC, INTER ఫీజు చెల్లించండి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఓపెన్ SSC, INTERలో చేరే విద్యార్థులు ఎగ్జామ్ ఫీ చెల్లించాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్(TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య తెలిపారు. ఈ నెల( ఫైన్ లేకుండా) 5లోగా.. ఫైన్‌తో 16లోగా ఎగ్జామ్ ఫీ ఆన్లైన్‌లో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు www.telanganaopenschool.org వెబ్ సైట్‌లో సందర్శించాలన్నారు.
Similar News
News January 5, 2026
NZB: హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

నిజామాబాద్‌లోని నాగారం బ్రాహ్మణ కాలనీకి చెందిన భైరగోని సతీశ్ గౌడ్‌కు హత్య కేసులో ఊరి శిక్ష విధిస్తూ NZB 3వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్ సోమవారం తీర్పు చెప్పారు. నాగారానికి చెందిన కండెల సందీప్‌ను 2025 ఫిబ్రవరిలో ఇందల్వాయి మండలం చంద్రయన్ పల్లి అటవీ ప్రాంతంలో హత్య చేసినట్లు అభియోగాలు రుజువు కావడంతో ఉరి శిక్ష పడింది. మరో 2 నేరాల్లో 7, 5 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
News January 5, 2026
రెచ్చిపోతున్న అమెరికా.. UNO ఎందుకు ఉందో?

ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను నివారించడం, అంతర్జాతీయ చట్టాలను అమలు పరిచేందుకు 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పడిందని చిన్నప్పుడు ఎంతో గొప్పగా చదువుకున్నాం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా.. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని లెక్క చేయకుండా దాడులకు పాల్పడుతోంది. ఏకంగా దేశాధ్యక్షుడినే ఎత్తుకుపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ UNO ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.
News January 5, 2026
కొలెస్ట్రాల్ పెరిగితే ఈ లక్షణాలు కనిపిస్తాయి

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. దీన్ని మనం ముందుగానే గమనించలేము. అయితే కొన్నిలక్షణాలతో దీన్ని ముందుగానే గుర్తించొచ్చంటున్నారు నిపుణులు. ఛాతీ నొప్పి, కాళ్ళలో నొప్పి, తిమ్మిరి, చర్మ మార్పులు, తలతిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, వాపు, హృదయ స్పందన రేటులో మార్పులు, దవడ నొప్పి, మెడ వెనుక భాగంలో నొప్పి వంటివి అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు.


