News March 16, 2024

MBNR : మోడీ సభ సక్సెస్.. బీజేపీ నేతల్లో జోష్

image

నాగర్ కర్నూల్ పట్టణ సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తాలో ఈరోజు జరిగిన మోదీ విజయ సంకల్ప యాత్ర విజయవంతం కావడంతో బీజేపీ నేతల్లో ఉత్సాహం పెరిగింది. ఈ సందర్భంగా.. మోదీ మాట్లాడుతూ.. భరత్ ప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. మోదీతోనే దేశాభివృద్ధి జరుగుతుందని డీకే అరుణ అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు నాయకులు, నేతలు పాల్గొన్నారు.

Similar News

News January 31, 2026

మహబూబ్‌నగర్: మున్సిపల్ ఎన్నికల భద్రతపై ఎస్పీ నిఘా

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ డి.జానకి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. వన్ టౌన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను శనివారం సందర్శించి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల వేళ ప్రత్యేక నిఘా కొనసాగించాలని, భద్రతలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు.

News January 31, 2026

MBNR: ఫిబ్రవరి 4న జిల్లాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు

image

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన నితిన్ నబిన్ ఫిబ్రవరి 4న మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్నారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే ఉమ్మడి జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఎంపీ డీకే అరుణ శనివారం సభా స్థలాన్ని పరిశీలించి, జాతీయ అధ్యక్షుడి హోదాలో నితిన్ నబిన్ తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు.

News January 31, 2026

MBNR: నేడు స్కూటీని.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

image

మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో శనివారం అధికారులు పత్రాల పరిశీలన చేపట్టారు. అసంపూర్తి సమాచారం, సాంకేతిక లోపాలు ఉంటే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. కాగా పాలమూరు కార్పొరేషన్‌కు 579, దేవరకద్ర 86, భూత్పూర్ 96 నామినేషన్లు రాగా, WNP జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు 812, NRPT 541, GDL 525, NGKL 521 నామినేషన్లు దాఖలయ్యాయి.