News March 18, 2024

MBNR: నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. సెంటర్ల వద్ద 144 సెక్షన్

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి నుంటి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీకా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. MBNR జిల్లాలో 59 సెంటర్లలో 12,866 మంది విద్యార్థులు, వనపర్తిలో 6,969 మంది, నాగర్ కర్నూల్‌లో 59 కేంద్రాల్లో 10,526 మంది, గద్వాలలో 7203 మంది పరీక్షలు రాయనున్నారు.

Similar News

News February 2, 2026

పాలమూరు: ఇక ప్రచారంపై పూర్తి ఫోకస్..!

image

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. గెలుపే లక్ష్యంగా తమ మద్దతుదారులతో కలిసి వ్యూహాలకు పదును పెడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 3 వరకు గడువు ఉండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు.

News February 2, 2026

MBNR: గండీడ్ వికారాబాద్‌లో కలిసేనా?

image

గండీడ్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలపాలని స్థానికులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇప్పటికే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ మండలం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. కానీ వికారాబాద్ సరిహద్దులో ఉంటూ అభివృద్ధి కోసం, పాలనా సౌలభ్యం కోసం జిల్లా మార్పు ఆవశ్యకమని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

News February 2, 2026

పాలమూరు: తేనెటీగల పెంపకం కోర్సుల్లో ఉచిత శిక్షణ

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ ప్రాంతాల వారికి SBI, RSETI ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకం కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. నేటి నుంచి ఈ శిక్షణ ప్రారంభమవుతుంది. ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు. 19-45 ఏళ్ల లోపు ఉన్నవారు టెన్త్ మెమో,ఆధార్ కార్డ్,రేషన్ కార్డ్, 3 ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 95424 30607కు సంప్రదించాలన్నారు.