News March 21, 2025

MBNR: TG ఖోఖో జట్టుకు ఎంపికైన డాక్టరమ్మ!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా ఆత్మకూర్ వెటర్నరీ దవాఖానాలో వెటర్నరీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శిల్ప గతంలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ చాటి జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టుకు ఆడనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. క్రీడల్లో పాల్గొనేందుకు ఇప్పటికే దిల్లీకి బయలుదేరారు. CONGRATULATIONS

Similar News

News April 19, 2025

నాగర్‌కర్నూల్: మహిళపై గ్యాంగ్ రేప్.. నిందితుల ఇంటి వద్ద విచారణ

image

నాగర్‌కర్నూల్ జిల్లా <<16145983>>ఊర్కొండపేట<<>> పబ్బతి అంజన్న గుడి వద్ద మహిళపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితులతో పోలీసులు రీకన్‌స్ట్రక్షన్ చేయించిన విషయం తెలిసిందే. కాగా ఘటనా స్థలానికి ఏడుగురు నిందితులను తీసుకొచ్చిన పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారాన్ని రాబట్టారు. అలాగే అత్యాచారం ఘటన తర్వాత వారు ఇంటికి ఎలా వెళ్లారన్న కోణంపై ఆరా తీశారు. గ్రామంలోని నిందితులను వారి ఇంటికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు.

News April 19, 2025

నాగర్‌కర్నూల్: మహిళపై గ్యాంగ్ రేప్.. సీన్ రీకన్‌స్ట్రక్షన్

image

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వారిని విచారిస్తున్నారు. శుక్రవారం నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. గతంలో నిందితులు ఏమైనా నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం.

News April 19, 2025

BREAKING: గద్వాలలో యాక్సిడెంట్.. భార్యాభర్తలు మృతి

image

గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ధర్మారెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి నంద్యాలకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ప్రియదర్శి హోటల్ ముందు జాతీయ రహదారిపై వారి కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మొత్తం ఆరుగురు ఉండగా అందులో పుల్లారెడ్డి, లక్ష్మీసుబ్బమ్మ భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు.

error: Content is protected !!