News September 21, 2024
MBNR: UPDATE.. ఓటర్ల వివరాలు ఇలా.!
మహబూబ్ నగర్ జిల్లాలో 441 గ్రామ పంచాయతీల్లో 3,838 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఈనెల 28న తుది జాబితా విడుదల చేసేందుకు అధికారులు గ్రామాల్లో, పట్టణాల్లో కసరత్తులు చేపట్టారు. ఈ నెల 13న ఓటర్ జాబితా ముసాయిదాను విడుదల చేయగా.. దాని ప్రకారం 5,16,062 మంది ఓటర్లు ఉన్నారు. 2,57,477 మంది పురుషులు, 2,58,578 మంది మహిళలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. పురుష ఓటర్లతో పోలిస్తే 1,101 మంది మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.
Similar News
News October 10, 2024
MBNR: హజ్ యాత్రకు 170 మంది ఎంపిక
ముస్లింల పవిత్ర ప్రార్థన స్థలమైన హాజ్‌కు జిల్లా నుంచి 170 మంది యాత్రికులు ఎంపికయ్యారు. యాత్రకు సంబంధించి బుధవారం బాక్స్ కాంప్లెక్స్‌లోని హాజ్ సొసైటీ భవనంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో దరఖాస్తులను ఎంపిక చేశారు. ఎంపికైన వారికి హాజ్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అలీ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి మొరాజుద్దీన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
News October 9, 2024
MBNR: జూ.అధ్యాపకుల ఎదురుచూపులు..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీలో ఎంపికైన వారికి ఈ రోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వం కేవలం 55 రోజుల్లో డీఎస్సీ ఫలితాలను వెల్లడించి 10 రోజుల్లో నియామక పత్రాలు అభ్యర్థులకు అందించనుంది. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకుల భర్తీని పట్టించుకోవడంలేదని ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. JL నియామక పత్రాలు వెంటనే అందజేయాలని కోరుతున్నారు.
News October 9, 2024
ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా…
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా కొత్తపల్లిలో 35.9 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో 35.0 డిగ్రీలు, గద్వాల జిల్లా భీమవరంలో 32.5 డిగ్రీలు, నారాయణపేట జిల్లా నర్వలో 32.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.