News March 31, 2025

MBNR: ‘అంబేడ్కర్ జాతర విజయవంతం కావాలి’

image

మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎంబీసీ మైదానంలో నిర్వహించనున్న పూలే – అంబేడ్కర్ జాతర పోస్టర్‌ను మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. పూలే -అంబేడ్కర్ జాతర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బోయపల్లి నర్సింహులు, వేంకట స్వామి, సామెల్, సిరసనోళ్ల బాలరాజు, గువ్వ లక్ష్మణ్ తదితరులున్నారు.

Similar News

News April 4, 2025

MBNR: ముగ్గురిపై కేసు నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం బిల్డింగ్‌తండా గ్రామంలో గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నిర్వహించారు. ఈ సమయంలో బందోబస్తుకు వచ్చిన ఎస్ఐ లెనిన్‌తో బిల్డింగ్‌తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కోయిలకుంట తండాకు చెందిన ముగ్గురు దురుసుగా ప్రవర్తించారు. తమ విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News April 4, 2025

గద్వాల: చికిత్స పొందుతూ మృతి

image

స్వచ్ఛంద సంస్థలో పని చేస్తూ మహిళకు ఆపద వచ్చిందంటే సామాజిక సేవలో ముందుడే జయభారతి గురువారం రాత్రి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో వంట చేస్తుండగా చీరకు నిప్పు అంటుకొని ప్రమాదం జరగగా మెరుగైన చికిత్స కోసం అపోల ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజుల నుంచి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News April 4, 2025

నారాయణపేటలో ఐదుగురిపై కేసు నమోదు

image

నారాయణపేట పట్టణంలో గురువారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ రేవతి తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు. వాహనాలకు నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిబ్బంది పాల్గొన్నారు.

error: Content is protected !!