News January 5, 2025
MBNR: చేతులకు సంకెళ్లతో ఉద్యోగుల నిరసన
ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారం కోరుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయ జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉద్యోగులు వినూత్న రీతిలో తమ నిరసన తెలిపారు. వారు తమ చేతులకు సంకెళ్లు వేసుకుని, ప్లకార్డులు పట్టుకొని ‘సంకెళ్లు తెంపండి.. రెగ్యులర్ చేయండి’ అనే నినాదంతో శిబిరంలో నినాదాలు హోరెత్తించారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
Similar News
News January 8, 2025
AMAZING: తాజ్మహల్లో పాలమూరు రాళ్లు!
తాజ్మహల్ నిర్మాణంలో మహబూబ్నగర్ ప్రాంతంలో లభించే క్రిస్టల్ క్వార్ట్జ్ రాళ్లను(పలుగు రాళ్లు) వాడినట్లు తాజాగా వెల్లడైంది. కాలిఫోర్నియాలోని జెమోలాజికల్ లైబ్రరీ& రీసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ లైబ్రేరియన్ డిర్లామ్, రీసెర్చ్ లైబ్రేరియన్ రోజర్స్, సంస్థ డైరెక్టర్ వెల్డన్ కలిసి అధ్యయనం చేపట్టారు. పర్చిన్కారి పద్ధతిలో ఈ రాళ్లను తాజ్మహల్ పాలరాతిలో అంతర్భాగంగా అమర్చినట్లు గుర్తించారు.
News January 8, 2025
MBNR: తగ్గిన ధరలు.. టమాటా రైతుల ఆందోళన
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు సీజన్లలోనూ 1,690 ఎకరాల్లో రైతులు టమాటా సాగు చేశారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల క్రితం కిలో రూ.25-30 పలకగా.. ప్రస్తుతం రూ.10కి పడిపోయింది. పట్టణంలోని రైతుబజార్లో రూ.10 నుంచి రూ.15లకు విక్రయిస్తున్నారు. పంట ఉత్పత్తి పెరగడం, రైతులంతా ఒకేసారి మార్కెట్లకు పంట దిగుబడులు తీసుకురావడంతో ధరలు పడిపోయాయని ఉద్యాన శాఖ అధికారి వేణుగోపాల్ తెలిపారు.
News January 8, 2025
MBNR: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దేవరకద్ర మండలంలో జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొని ఇద్దరు, జడ్చర్ల సమీపంలో రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని ఓ వ్యక్తి, మూసాపేట మండలంలోని కొమిరెడ్డిపల్లి సమీపంలో లారీ ఢీకొనడంతో స్కూటీపై వెళ్తున్న ఆర్ఎంపీ డాక్టర్ మృతి చెందారు. ఈ ఘటనల్లో తీవ్రగాయాలైనవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.