News April 30, 2024

MBNR: టెన్త్ ఫెయిలైన విద్యార్థులు ఇది మీకోసమే.!!

image

టెన్త్ ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 13 వరకు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఉ.9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. రీకౌంటింగ్‌కు 15రోజుల వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించాలన్నారు. ఆన్సర్ షీట్ ఫొటో కాపీ కోసం సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలన్నారు.

Similar News

News January 25, 2026

MBNR: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్

image

ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాల కోసం 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కరపత్రాలను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. గత రెండేళ్లలో ఇక్కడి విద్యార్థులు 94 ఉద్యోగాలు సాధించారని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. డిగ్రీ అర్హత కలిగిన SC, ST, BC అభ్యర్థులు ఈనెల 30లోగా www.tsstudycircle.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

News January 24, 2026

మహబూబ్‌నగర్: విద్యుత్ సమస్యలకు చెక్

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో ఉన్న మొక్కలను తొలగిస్తున్నామని ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ భీమా నాయక్ తెలిపారు. తిరుమలాపూర్ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్నామన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని పలువురు ఎస్ఈకి ఫిర్యాదు చేయగా పనులు చేపట్టామని చెప్పారు.

News January 23, 2026

గంగాపురం జాతరకు ప్రత్యేక బస్సులు

image

గంగాపురంలో కొలువైన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ సంతోశ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారికి సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా టెంట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.