News November 10, 2024
MBNR: తగ్గుతున్న అమ్మాయిలు..తనిఖీలపై నిఘా!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 3 సంవత్సరాలుగా జననాల రేటులో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య తగ్గుతుంది. గత ఏడాదిలో బాలురు 28,891 జననాలు నమోదు కాగా.. అమ్మాయిలు 25,822 మంది మాత్రమే ఉన్నారు. పలు స్కానింగ్ కేంద్రాల్లో బేబీ జెండర్ గురించి చెప్తున్నట్లు సమాచారం. బాలికల కోసం సంక్షేమ పథకాలను అవగాహన కల్పిస్తూ, స్కానింగ్ కేంద్రాలను తనిఖీలు చేస్తున్నామని DMHO అధికారులు తెలిపారు.
Similar News
News May 7, 2025
MBNR: నూతన విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఎమ్మెల్యే భూమి పూజ

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల సమీపంలో రు.3.29 కోట్లతో నూతనంగా నిర్మించిన విద్యుత్తు సబ్ స్టేషన్‌కు ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి శనివారం భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే మహబూబ్‌నగర్ పట్టణంలోని కొన్ని ప్రాంతాలు, వివిధ గ్రామాల్లో కరెంటు సమస్య తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
News May 7, 2025
జడ్చర్ల: బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి

జడ్చర్ల మున్సిపాలిటీ కావేరమ్మ పేట, రాఘవేంద్ర కాలనీ, జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆ పార్టీ జెండాను ఈరోజు ఆవిష్కరించారు. గంగాపూర్ గ్రామంలో మహిళలు బోనాలతో ఆయనకు స్వాగతం పలికారు. జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు వరంగల్ సభకు రావాలని కోరారు.
News May 7, 2025
MBNR: ‘మే 3 నుంచి వేసవి శిబిరం ప్రారంభం’

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సుద్దాల హనుమంతు సంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని మే 3 నుంచి ప్రారంభించనున్నామని నిర్వాహకుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొనే విద్యార్థులు పదేళ్లు దాటిన వారికి వివిధ విభాగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.