News January 30, 2025
MBNR: తల్లి మృతి.. తల్లడిల్లిన పిల్లలు

WNP జిల్లా మదనాపురం మండలం దుప్పల్లిలో బుధవారం రమేశ్ నాయక్ భార్య కేత్లావత్ శాంతమ్మ(30) మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. వలస కూలిగా వెళ్లిన శాంతమ్మ కరీంనగర్‌లో జరిగిన గొడవ కారణంగా మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన ఆ పిల్లలు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.
Similar News
News March 13, 2025
ఓటేరు చెరువును కాపాడుతాం: నారాయణ

భూ ఆక్రమణదారుల నుంచి ఓటేరు చెరువును కాపాడి తీరుతామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తేల్చి చెప్పారు. చెరువు ఆక్రమణ తొలగించే వరకు పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి ఓటేరు చెరువును నారాయణ పరిశీలించారు. అక్కడ చెరువు ఆక్రమణను చూసి ఆయన మండిపడ్డారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే చెరువును పూడ్చేందుకు కబ్జాదారులు యత్నించిన వైనాన్ని ఆయనకు సీపీఐ, సీపీఎం, ఆర్పీఐ నాయకులు వివరించారు.
News March 13, 2025
ప్రభుత్వ సేవలకు లబ్ధిదారుల్లో సంతృప్తి ఉండాలి: కలెక్టర్

మహిళా సంఘాల సభ్యులతో ఎంఎస్ఎమ్ఈల ఏర్పాటుకు డీపీఆర్‌లు రూపొందించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను బుధవారం ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సీఎం అధ్యక్షతన నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి లబ్ధిదారుల్లో సంతృప్తి ఉండాలని సూచించారు.
News March 13, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా.!

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అరుదైన మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.16,500 పలకగా, 5531 రకం మిర్చికి రూ. 11,000 ధర వచ్చింది. అలాగే 1048 మిర్చికి రూ.11 వేలు, టమాటా మిర్చికి రూ.32వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.37000 ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.