News April 9, 2024

MBNR: తాగుడుకు బానిసై వ్యక్తి ఆత్మహత్య

image

తాగుడుకు బానిసై భార్యతో గొడవ పడి క్షణికావేశంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గోకారంకు చెందిన బాదగోని అల్లాజి (52) మద్యానికి బానిస కావడంతో భార్య మల్లమ్మ వారించి చెప్పగా వారి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మనస్తపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని మృతిచెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 23, 2024

MBNR: స్థానిక పోరు..3,836 వార్డులు!

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన మండలాలతో కలిపి 16 మండలాలు ఉన్నాయి. వీటిలో 441 గ్రామ పంచాయతీలు, 3,836 వార్డులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తూ.. ఓటు వేసేందుకు ఇబ్బందులు లేకుండా గ్రామానికి దగ్గరగా ఉండే భవనాలను ఎంపిక చేశారు.గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా
సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

News December 23, 2024

MBNR: TGBలుగా APGV బ్యాంకులు!!

image

ఆంధ్రప్రదేశ్ గ్రామీ వికాస్ బ్యాంక్ (APGVB) తెలంగాణ గ్రామీణ బ్యాంకు(TGB)లో విలీనం కానుంది. 2025 JAN1 నుంచి ప్రారంభం కానుంది. MBNR-24,NGKL-26,WNPT-11,GDWL-11,NRPT-13 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈనెల 28 నుంచి 31 వరకు బ్యాంకింగ్ సేవల (UPI, ATM, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, AEPS, CSP) తాత్కాలికంగా అంతరాయం ఏర్పడుతుందని, ఏవైనా సమస్యలు ఉంటే సమీపంలో ఉన్న బ్రాంచ్‌ను సంప్రదించాలన్నారు.

News December 23, 2024

BRS ప్రతిపక్షంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయారు: ఎంపీ

image

బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చి ఒక్క ఏడాది అయిందనే విషయాన్ని కేటీఆర్, హరీష్ రావులు మర్చిపోయారు. ఇంకా తామే అధికారంలో ఉన్న ఊహల్లో మాట్లాడుతున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. గతంలో వారు లక్ష రుణమాఫీ అని నాలుగు, ఐదు కంతుల్లో వేస్తే అవి వడ్డీలకే సరిపోయాయని విమర్శించారు.