News April 13, 2025

MBNR: దళితులను విస్మరించిన పార్టీ కాంగ్రెస్: ఎంపీ 

image

అంబేడ్కర్‌ను అడుగడుగున మోసం చేసింది కాంగ్రెస్ అని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ రాజ్యాంగంపై, పార్టీపై చేస్తున్న దుష్ప్రచారాలు తిప్పికొట్టి కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దళితుల సంక్షేమానికి, అంబేద్కర్‌ సంయాన్ అభియాన్ కార్యక్రమాలు 13 నుంచి 25 వరకు జరుగుతాయన్నారు.

Similar News

News April 14, 2025

BREAKING: గద్వాల: యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాందేడ్ నుంచి పసుపు లోడ్‌తో కేరళకు వెళ్తున్న లారీ హైవే పక్కన ఆగింది. ఈ సమయంలో షాద్‌నగర్ నుంచి ఆళ్లగడ్డ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ షేక్ హుస్సేన్, క్లీనర్ వీరయ్య మృతిచెందారు.

News April 14, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో 2 చిరుత పులుల కలకలం..!

image

మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం యన్మన్గండ్ల గ్రామ సమీపంలోని దేవరగట్టులో 3 రోజులుగా 2 చిరుత పులులు సంచరిస్తున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని, అటవీ శాఖ అధికారులు స్పందించి సాధ్యమైనంత త్వరగా వాటిని బంధించాలన్నారు. స్థానిక గుట్టపై చిరుత పులులు సంచరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

News April 14, 2025

BREAKING: మహబూబ్‌నగర్‌లో తీవ్ర విషాదం

image

మహబూబ్‌నగర్‌లో ఈరోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద క్వారీ గుంతలో ఈతకు దిగిన ముగ్గురు యువకులు నీట మునిగారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఒక యువకుడి మృతదేహం లభ్యం కాగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరు యువకులు మునిగిపోతుండగా వాళ్లని కాపాడబోయి మరో యువకుడు కూడా మునిగిపోయాడు.

error: Content is protected !!