News October 18, 2024

MBNR: దసరా EFFECT..రాష్ట్రంలోనే మనమే NO:1

image

దసరా పండుగ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజియన్ రాష్ట్రంలోనే అత్యధిక ఆక్యూపెన్సీ రేషియో(OR) 104% సాధించి అగ్రస్థానంలో నిలిచిందని ఆర్ఎం వి.శ్రీదేవి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పది డిపోల్లో ఓఆర్ సాధించడంతో పాటు 3 బస్ డిపోలు(NGKL,WNPT,GDWL) ఉత్తమ(కిలో మీటరుకు ఆదాయం) ఈపీకేతో పాటు ఓఆర్ అవార్డులకు ఎంపికయ్యాయని, దీంతో అధికారులను,డ్రైవర్,కండక్టర్లను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించినట్లు తెలిపారు.

Similar News

News October 18, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 29.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గద్వాల జిల్లా కేంద్రంలో 15.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా పెబ్బేరులో 11.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా నర్వలో 7.8 మిల్లీమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 6.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News October 18, 2024

సనాతన ధర్మ పరిరక్షణకు యువకుడి సైకిల్ యాత్ర

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లికి చెందిన మల్లేశ్ దేశంలోని ద్వాదశ (12) జ్యోతిర్లింగాల దర్శనార్థం గురువారం సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. మొదటగా పాలమూరు నుంచి తాండూరు మార్గంలో యాత్ర సాగనుంది. రోజుకు 100 కి.మీ.లు సైకిల్ యాత్ర చేసి స్థానిక ఆలయాల్లో బస చేస్తానని తెలిపాడు. సనాతన ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ ఈ యాత్ర కొనసాగించనున్నట్లు అతడు పేర్కొన్నాడు.

News October 18, 2024

కులగణనకు సిద్ధం.. తరువాతే స్థానిక ఎన్నికలు

image

కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇంటింటికీ తిరిగి అన్ని కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిగతుల్ని అంచనా వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. 2 నెలల్లోపే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2014లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన సమగ్ర సర్వేలో జనాభా 42,84,024 ఉండగా, 9,67,013 కుటుంబాలు నివసిస్తున్నట్లు తేల్చారు.