News May 24, 2024

MBNR: దోస్త్ దరఖాస్తు గడువు పొడిగింపు

image

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశానికి DOST(డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) మొదటి విడత దరఖాస్తుకు ఈనెల 29 వరకు అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దోస్త్ మొదటి విడత సీట్ అలాట్మెంట్ JUNE 6న ప్రకటించనున్నారు. వివరాలకు dost.cgg.gov.in లాగిన్ కావచ్చు
#SHARE IT.

Similar News

News January 11, 2025

MBNR: నియోజకవర్గాల వారీగా ఓటరు జాబితా ఇలా!

image

❤MBNR-2,62,311
❤కొడంగల్-2,46,526
❤జడ్చర్ల-2,24,477
❤దేవరకద్ర-2,40,980
❤నారాయణపేట-2,38,629
❤గద్వాల-2,58,460
❤వనపర్తి-2,75,059
❤మక్తల్-2,48,105
❤కొల్లాపూర్-2,41,460
❤షాద్ నగర్-2,43,260
❤కల్వకుర్తి-2,46,523
❤అచ్చంపేట-2,49,620
❤నాగర్ కర్నూల్-2,37,422
❤అలంపూర్-2,41,522
ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 34,54,354 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 17,10,989, మహిళలు 17,43,276, ఇతరులు 89 మంది ఉన్నారు.

News January 11, 2025

MBNR: మాదకద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ జానకి

image

మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశించారు. బాలానగర్ మండల పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం సందర్శించారు. పోలీసు సేవలపై అభిప్రాయాన్ని కోరుతూ.. క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాలికలు, మహిళలపై జరిగే వేధింపులు, సైబర్ క్రైమ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపాజీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News January 11, 2025

MBNR: స్కాలర్‌షిప్ రాక.. విద్యార్థుల ఇబ్బందులు.!

image

సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విద్యార్థులు కోరుతున్నారు. స్కాలర్‌షిప్ రాలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందించాలని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్కాలర్ షిప్‌ను చెల్లించాలని కోరారు.