News December 8, 2024
MBNR: నేడు అథ్లెటిక్స్, యోగా క్రీడాకారుల ఎంపిక
పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు అథ్లెటిక్స్ యోగాలో స్త్రీ, పురుషుల విభాగంలో ఆదివారం ఎంపికలు నిర్వహిస్తున్నట్లు PD శ్రీనివాసులు తెలిపారు. అథ్లెటిక్స్ విభాగంలో జంప్స్, రన్స్, త్రోస్.. యోగా విభాగంలో యోగాసనాలు, సూర్య నమస్కారాలు తదితర ఆసనాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం చదువుతున్న బోనఫైడ్, టెన్త్ మెమోతో హాజరు కావాలన్నారు. PU పరిధిలోని అన్ని కళాశాలల క్రీడాకారులు పాల్గొనవచ్చని చెప్పారు.
Similar News
News December 27, 2024
కొందుర్గు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం గంగన్నగూడానికి చెందిన శేఖర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి సమీపంలో ఉన్న ఉప్పలకుంట చెరువులో శేఖర్ రెడ్డి గతంలో చేపలు బయటకు వెళ్లేవాడు. ఈనెల 24న ఇంటి నుంచి వెళ్లిన శేఖర్ రెడ్డి తిరిగి రాకపోవడంతో పలుచోట్ల గాలించగా చెరువులో శవమై కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్య? హత్య? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
News December 26, 2024
NGKL ఎంపీని కలిసిన పీయూ ఉపకులపతి
హైదరాబాదులోని NGKL ఎంపీ డాక్టర్ మల్లు రవి నివాసంలో గురువారం పాలమూరు పీయూ ఉపకులపతి శ్రీనివాస్ కలిసి పీజీ సెంటర్ స్థాపన గురించి వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎంపీతో చర్చించారు. సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు వచ్చే విధంగా చూస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.
News December 26, 2024
క్రిస్మస్ వేడుకలతో దద్దరిల్లిన మహబూబ్నగర్
క్రిస్మస్ వేడుకలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దద్దరిల్లింది. నగరంతో పాటు.. జిల్లాలోని పలు చర్చిల్లో పాస్టర్లు ప్రార్థనలు చేసి ఏసుక్రీస్తు చూపిన మార్గంలో అంతా నడవాలని సూచించారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని జీసస్ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. చర్చ్లతో పాటు.. నగరం అంతా దీపాల వెలుగులతో నింపేశారు. కాగా, క్రిస్మస్ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.