News November 28, 2024

MBNR: నేడు పాలమూరుకు మంత్రులు రాక

image

MBNR జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లో రేపటి నుంచి మూడు రోజులపాటు రైతు పండుగ నిర్వహిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గురువారం ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

Similar News

News December 17, 2025

మహబూబ్‌నగర్‌లో 25% ఓటింగ్ నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు మండలాల్లో మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 25 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. మొత్తం 1,42,909 మంది ఓటర్లకు గాను 36,232 మంది తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకున్నారు. ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

News December 17, 2025

MBNR: నేడు 122 సర్పంచ్‌లు, 914 వార్డులకు ఎన్నికలు

image

మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత ఎన్నికల నేపథ్యంలో మొత్తం 133 జీపీలు,1152 వార్డ్ సభ్యులకు గాను 10 సర్పంచ్ లు,231 వార్డ్‌లు ఏకగ్రీవం. జడ్చర్ల(M)లో ఒక జీరో నామినేషన్, 7 వార్డ్ సభ్యులకు జీరో నామినేషన్ పోను 122 సర్పంచ్‌లు, 914 వార్డ్ సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌లకు ఏకగ్రీవంతో కలిపి 440 మంది అభ్యర్థులు, వార్డ్ సభ్యులు 2,584 మంది పోటీలో ఉన్నారని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.

News December 17, 2025

MBNR:‘ఇన్నోవేషన్ పంచాయత్’.. రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా!

image

తెలంగాణ ఇన్నోవేషన్ సెల్(టీజీఐసీ ) తెలంగాణలోని ఆవిష్కర్తలను, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.https://forms.gle/Av75xS4UUGRNKLpx8 ఫార్మ్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. యువ పారిశ్రామికవేత్తలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT.