News March 29, 2025
MBNR: ‘న్యాయమైన ప్రాతినిధ్యం, రాజకీయ రిజర్వేషన్ల కల్పించాలి’

వెనుకబడిన తరగతులకు న్యాయమైన ప్రాతినిధ్యం, రాజకీయ రిజర్వేషన్ల కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం బెంగళూర్లోనీ ప్రెస్ క్లబ్ ఆఫ్ బెంగళూర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జనాభా ఆధారంగా లోక్ సభ సీట్ల పెంపు, దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్పిస్తుందన్నారు. జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల పెంపు అన్యాయం మాత్రమే కాదు, సమాన ప్రాతినిధ్యం ప్రధాన సూత్రాలను కూడా దెబ్బతీస్తుందన్నారు.
Similar News
News April 2, 2025
MBNR: నేడు ఎస్ఎల్బీసీకి మంత్రి పొంగులేటి రాక

ఎస్ఎల్బీసీ శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో చిక్కుకొని ప్రాణాలు వదిలిన వారి ఆచూకీ కోసం 38 రోజులుగా సహాయక కొనసాగుతున్నాయి. 24 గంటల పాటు మూడు షిప్టుల్లో 600 మంది రెస్క్యూ బృందాలు శ్రమిస్తూనే ఉన్నారు. ఈ చర్యలను పరిశీలించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రానున్నారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే లు రానున్నారు.
News April 2, 2025
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అక్రమార్కుడు: ఎమ్మెల్యే

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిని విస్మరించి అక్రమంగా రూ.కోట్లు ఆర్జించాడని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో ఒక్క రేషన్ కార్డు కానీ,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కానీ మాజీ ఎమ్మెల్యే ఇవ్వలేదన్నారు.గత ప్రభుత్వ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి చిప్ప చేతికిచ్చారన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ సీఎం హామీలను అమలు చేస్తున్నారన్నారు.
News April 2, 2025
మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు జర జాగ్రత్త: ఎస్పీ

బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్‌కు దూరంగా ఉండాలని, అవి ప్రాణాలతో చెలగాటమాడుతాయని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి ఓ ప్రకటనలో హెచ్చరించారు. విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత గేమింగ్ ప్లాట్ఫామ్లో IPL బెట్టింగ్‌లకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.