News April 4, 2024

MBNR: పచ్చటి అడవి మధ్యలో వెలసిన ఆలయం

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి నవాబ్ పేట మండల కేంద్రానికి మార్గ మధ్యంలో 9 కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో వెలసిన పర్వతాపూర్ మైసమ్మ దేవాలయం ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచినది. కొత్త వాహనం తెచ్చినా, ఎన్నికల ప్రచారాలు ఈ ఆలయం నుండి పూజలు చేసి ప్రారంభించడం ఆనవాయితీ. ఆది, మంగళవారాలు వేల సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని దర్శించుకుని బోనాలు సమర్పిస్తారు.

Similar News

News September 30, 2024

నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలి: సిక్తా పట్నాయక్

image

ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట శివారులోని వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని, దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 30, 2024

రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: డీకే అరుణ

image

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నేడు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతుహామీల సాధనదీక్షలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు. రైతురుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వడ్లకు బోనస్ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు.

News September 30, 2024

అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

image

దౌల్తాబాద్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివారాలు.. దౌల్తాబాద్ మండలం నుంచి అంత్యక్రియల కోసం వెళ్తుండగా దేవర ఫసల్వాద్ సమీపంలో అదుపు తప్పి ఈర్లపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.