News February 2, 2025

MBNR: పరీక్షల షెడ్యూల్ విడుదల

image

మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ (B.PEd) మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష హాలులోకి తప్పనిసరిగా హాల్ టికెట్, ఆధార్ కార్డు తీసుకొని రావాలని తెలిపారు.

Similar News

News February 2, 2025

ఇంటర్ ప్రయోగ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రయోగ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయినట్లు డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యే ప్రయోగ పరీక్షల వివరాలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 36 జనరల్ పరీక్షా కేంద్రాలు, 7 ఒకేషనల్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

News February 2, 2025

లింబాద్రి గుట్ట స్వామిని దర్శించుకున్న శ్రీముఖి

image

భీమ్‌గల్ మండలం లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు ఆమెకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెను శాలువాతో సన్మానించారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఆమెతో ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపారు.

News February 2, 2025

MDK: రోగులకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

image

రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య అధికారులను ఆదేశించారు. రామాయంపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఫార్మసి గది, రక్త పరీక్షలు ల్యాబ్, ఇన్ పేషెంట్స్ వార్డు, మందుల నిలువ స్టోర్ పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఆస్పత్రి నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.