News March 25, 2025

MBNR: పసి బిడ్డలకు ఏం తెలుసు అమ్మానాన్న మళ్లీ రారని..!

image

ఊహ తెలియని వయసులోనే వారి తల్లిదండ్రులు చనిపోయారు.. అనాథలుగా మారిన ఆ పిల్లలకు ఏం తెలుసు అమ్మానాన్న మళ్లీ రారని..ఆకలైనప్పుడు అమ్మా అని ఎన్నిసార్లు పిలిచినా అమ్మ రావట్లేదని ఆ పిల్లలు అంటున్న మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. గద్వాల(D),మల్దకల్(M), చర్లగార్లపాడులోని ముగ్గురు పిల్లలను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. నేడు అయిజ(M) యాపదిన్నె వాసులు రాకేశ్, రామాంజనేయులు వారికి రూ.10,500ఆర్థిక సాయం చేశారు.

Similar News

News April 1, 2025

రామ్ చరణ్ ‘పెద్ది’ ఆడియో హక్కుల ధర ఎంతంటే..

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మూవీ- ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో మూవీకి మంచి బజ్ నెలకొనగా మూవీ టీమ్ తాజాగా మరో క్రేజీ న్యూస్‌ చెప్పింది. ఏఆర్ రెహమాన్ అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్‌ను టీ-సిరీస్ రూ.35కోట్లకు దక్కించుకుందని ప్రకటించింది. రెహమాన్-చెర్రీ కాంబోలో ఇదే తొలిమూవీ కావడం విశేషం.

News April 1, 2025

ఆరుబయట పడుకుంటున్నారా?

image

వేసవి కారణంగా చాలామంది ఆరుబయటో, మేడపైనో పడుకుంటుంటారు. ఒకప్పుడైతే వేసవినాటికి దోమలు పోయేవి. కానీ నేడు విషజ్వరాలను కలిగించే దోమల సంతతి వేసవిలోనూ ఉంటోంది. ఈ నేపథ్యంలో బయట పడుకునేవారు కచ్చితంగా దోమల తెరను వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే చోటుకు కొంచెం దూరంలో సాంబ్రాణి ధూపం వేస్తే ఆ వాసనకు దోమలు దూరంగా ఉంటాయంటున్నారు. కాళ్లకు చేతులకు నూనె రాసుకున్నా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

News April 1, 2025

స్కిన్ క్యాన్సర్‌తో బాధపడ్డా: జాన్ సీనా

image

WWE సూపర్‌స్టార్ జాన్ సీనా అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గతంలో తాను స్కిన్ క్యాన్సర్‌ బారినపడ్డట్లు వెల్లడించారు. ‘ఒకసారి డెర్మటాలజిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు ఈ విషయం బయటపడింది. వైద్యులు నా స్కిన్ కింది నుంచి క్యాన్సర్ కణుతులను తొలగించారు. WWE మ్యాచ్‌ల సందర్భంగా నా శరీరంపై మీరు ఆ స్పాట్స్‌ను చూడొచ్చు. మహమ్మారిపై పోరాడే సందర్భంలో కఠిన సవాళ్లు ఎదురయ్యాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

error: Content is protected !!