News February 25, 2025
MBNR: పాన్ షాప్‌లపై గట్టినిఘా: అదనపు కలెక్టర్

మాదకద్రవ్వాల నియంత్రణకై జిల్లా వ్యాప్తంగా డ్రాగ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పాన్‌షాప్‌లపై గట్టి నిఘా పెట్టాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అధికారులకు సూచించారు. మంగళవారం తన ఛాంబర్‌లో దాడులపై సమీక్ష నిర్వహించారు. డ్రగ్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వాటిని విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
Similar News
News February 26, 2025
MBNR: ప్రతి కళాశాలలో యాంటిడ్రగ్స్ కమిటీలు: అదనపు కలెక్టర్

జిల్లాలోని జూనియర్ కళాశాలలు డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అధికారులకు సూచించారు. మంగళవారం తన ఛాంబర్‌లో మాదకద్రవ్యాలు, సైకో ట్రోపిక్ పదార్థాల నియంత్రణపై సమీక్షించారు. వీటి నియంత్రణకు ప్రతి కళాశాలలో యాంటీ డ్రగ్ కమిటీలను నియమించాలని అధికారులను ఆదేశించారు.
News February 25, 2025
జడ్చర్లలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలు.. పట్టణంలోని బీఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన బిహార్‌కి చెందిన రాషద్ ఖాన్ రూం రెంట్‌కి తీసుకుని ఉంటున్నాడు. కాగా, సోమవారం బాత్ రూంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. సమాచారం అందుకున్న సీఐ కమలాకర్, సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 25, 2025
జడ్చర్ల: ఆటో, బైక్ ఢీ.. యువకుడికి గాయాలు

జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108లో ఆసుపత్రికి తరలించారు. నసురుల్లాబాద్ శివారులోని మూలమలుపు వద్ద తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.