News March 8, 2025

MBNR: ప్రతిభ కనబరిచిన మహిళలను అభినందించిన కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన మహిళలను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఘనంగా సత్కరించి వారికి బహుమతులు అందజేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మహిళల్ని సన్మానించి అభినందించారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 14, 2025

MBNR జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే..!

image

మిడ్జిల్ మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మసి గుండ్లపల్లి సర్పంచ్‌గా శ్రీశైలం యాదవ్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి మీద చెన్నయ్య 16ఓట్ల తేడాతో గెలుపొందారు. 8 వార్డు స్థానాలకు సభ్యులను గ్రామస్థులు ఎన్నుకున్నారు. సందర్భంగా గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.

News December 14, 2025

MBNR: ఆరు మండలాల్లో 79.30 శాతం పోలింగ్

image

మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, చిన్న చింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల్లో ఒంటిగంట వరకు 79.30% పోలింగ్ నమోదైంది. దేవరకద్ర మండలంలో అత్యధికంగా 88% పోలింగ్ జరగ్గా, మిడ్జిల్‌లో 73% నమోదైంది. మొత్తం 1,46,557 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

News December 14, 2025

MBNR: 11 గంటల వరకు 55 శాతం పోలింగ్

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 06 మండలాలలో రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉదయం 07 గంటల నుంచి 11 గంటల వరకు దాదాపు 55 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. చిన్నచింతకుంట, కౌకుంట్ల, హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, దేవరకద్ర మండలాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.