News August 7, 2024

MBNR: ఫ్యాన్సీ నంబర్‌కు రూ.5.75 లక్షలు

image

MBNR రవాణా శాఖ అధికారులు మంగళవారం టీజీ 06,6666 అనే ఫ్యాన్సీ నంబరుకు ఆన్‌లైన్ వేలం నిర్వహించగా.. 9 మంది వాహనదారులు ఒక్కొక్కరు రూ.30వేల చొప్పున చెల్లించారు. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన వేలంలో కె.బాలకృష్ణ అనే వ్యక్తి అత్యధికంగా రూ.5.45 లక్షలకు కోట్ చేయగా అధికారులు ఆయనకు ఆ నంబర్ కేటాయించారు.ఈ నంబరు వేలంతో రవాణా శాఖకు మొత్తం రూ.8.15 లక్షల ఆదాయం సమకూరింది.

Similar News

News October 1, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న అమ్మాయిలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3ఏళ్లుగా జననాల రేటులో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. గత ఏడాదిలో బాలురు 28,891 జననాలు నమోదు కాగా.. అమ్మాయిలు 25,822 మంది మాత్రమే మాత్రమే జన్మించారు. పలు స్కానింగ్ కేంద్రాల్లో బేబీ జెండర్ గురించి చెప్తున్నట్లు సమాచారం. ఇలాగైతే బాలికల శాతం తగ్గనుంది. బాలికల కోసం సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ స్కానింగ్ కేంద్రాలు తనిఖీలు చేస్తున్నామని DMHO పద్మా తెలిపారు.

News October 1, 2024

MBNR: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతితోపాటు మాంసాహారం, వైన్స్ బంద్ కానున్నాయి. దీంతో MBNR, గద్వాల, NRPT, వనపర్తి, NGKLజిల్లాల ప్రజలు పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అనే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలంటున్నారు.

News October 1, 2024

ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా రేమద్దులలో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా ఐజలో 35.7 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా దోనూరులో 35.6 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా పెద్దూరులో 34.8 డిగ్రీలు, నారాయణపేట జిల్లా మంగనూరులో 34.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలో నమోదయ్యాయి.