News March 20, 2025
MBNR: బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రంలోని బీసీ గురుకుల పాఠశాలల్లో 2025-2026 ఏడాదికి 6,7,8,9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. http://www.mjptbcadmissions.org లో ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి. సైదులు తెలిపారు. ఎప్రిల్ 24న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మొత్తం 6,832 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తామన్నారు.
-SHARE IT
Similar News
News March 21, 2025
మహబూబ్‌నగర్: మొదటి పరీక్షకు 41 మంది గైర్హాజరు

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగాయి. నేటి పరీక్షకు 12,785 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 12,744 మంది విద్యార్థులు హాజరయ్యారు. 41 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇక మొత్తంగా 99.98 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు. పరీక్షల సందర్భంగా నేడు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
News March 21, 2025
MBNR: పదోతరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ

పదో తరగతి పరీక్షలను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మహత్మా గాంధీ రోడ్, క్రీస్తు జ్యోతి విద్యాలయం, భూత్పూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ తీరును ఆమె ఈరోజు పరిశీలించారు. మౌలిక సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News March 21, 2025
విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్

కర్ణాటక ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేయనుంది. 8 నుంచి 12వ తరగతి విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెట్టనుంది. కౌమారదశలో శారీరక, భావోద్వేగ, హార్మోన్ల మార్పుల గురించి వారికి అవసరమైన నాలెడ్జ్‌ను అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వైద్య నిపుణులు వారానికి రెండు సార్లు తరగతులు నిర్వహిస్తారు. అలాగే, చిన్న వయసులో లైంగిక కార్యకలాపాల వల్ల దుష్ప్రభావంపై కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.