News March 23, 2025
MBNR: భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

నూతనంగా నిర్మిస్తున్న భవనంపై నుంచ పడి వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. గాజులపేటకు చెందిన రమేశ్(42) పీయూ ఆవరణలో నిర్మిస్తున్న భవనంలో పనులు చేస్తుండగా జారి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని జనరల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం HYDకి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలో చనిపోయారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News March 27, 2025
మహబూబ్‌నగర్‌లో ముమ్మరంగా రంజాన్ ఏర్పాట్లు

రంజాన్ పండుగను పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వాగు గుట్ట వద్ద మైనార్టీ సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా నిర్వహిస్తున్న ఏర్పాట్లను మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైట్లు, కూలర్ల ఏర్పాటు విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అన్నారు. కార్యక్రమంలో నాయకుడు సిరాజ్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.
News March 27, 2025
పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.
News March 27, 2025
MBNR: రైతన్నకు మంచినీటి కష్టాలు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ వ్యవసాయ మార్కెట్‌లో రైతన్నలు, వ్యవసాయ కూలీలకు నీళ్లు లేక వేసవి కాలంలో అలుమటిస్తున్నారు. మార్కెట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా, నీటి మూటలుగానే మిగులుతున్నాయని వారు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేసి వేసవిలో రైతులకు దప్పిక తీర్చాలని కూలీలు కోరుతున్నారు.