News March 24, 2025

MBNR: మాజీ మంత్రి VS MLA.. తగ్గేదేలే..!

image

మహబూబ్‌నగర్‌లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు మాజీ మంత్రి, BRS మాజీ MLA శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫైర్ అవుతున్నారు. 14 నెలల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేసిందంటున్నారు. మరోవైపు MLA యెన్నెం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. అప్పులు చేసి ఆగం చేసింది BRS వాళ్లే అని కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?

Similar News

News March 27, 2025

MBNR: ఈనెల 31వ తేదీ తర్వాత గడువు పొడిగింపు ఉండదు: కలెక్టర్

image

ఈ నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి రాయితీ పొందాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఒక ప్రకటనలో అన్నారు. 31వ తేదీ తర్వాత ఎటువంటి గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్‌పై లేఅవుట్ డెవలపర్లు, డాక్యుమెంట్ రైటర్లు, సర్వేయర్లుగా ప్లాట్ల యజమానులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు.

News March 27, 2025

MBNR: సంక్షేమ పథకాలు లక్ష్యం మేరకు పూర్తి చేయండి: కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లక్ష్యం మేరకు పూర్తి చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు బుధవారం కలెక్టర్ మిడ్జిల్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీరు, విద్యుత్ సరఫరాలపై ముందుగా సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులతో పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News March 26, 2025

మహబూబ్‌నగర్ POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా MBNR డీసీసీ చీఫ్‌గా MLA మధుసూదన్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు NP.వెంకటేశ్, వినోద్, సిరాజ్, రబ్బానీ ఆశావహులుగా ఉన్నారు.

error: Content is protected !!