News May 3, 2024

MBNR: మీ అభ్యర్థి వివరాలు తెలుసుకోండి ఇలా!

image

లోక్ సభ నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులు బరిలో నిలిచారన్నది చాలామందికి తెలియదు. ఎవరెవరు పోటీ చేస్తున్నారో కేవైసీ(నో యువర్ క్యాండిడేట్) యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీని ద్వారా పోటీ చేసే అభ్యర్థి విద్యార్హతలు, వారికి నేర చరిత్ర ఉందా, ఎక్కడెక్కడ ఎంత మేర ఆస్తులు ఉన్నాయి. స్థిర, చర ఆస్తులు, ఇతర వివరాలన్నీ ఇందులో ఉంటాయి. దీన్ని బట్టి ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.

Similar News

News January 5, 2025

MBNR: పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ

image

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల బాత్ రూంలో సెల్‌ఫోన్ కెమెరా పెట్టిన ఘటనపై కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకీతో కలిసి కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపల్, విద్యార్థినులతో మాట్లాడారు. ఘటనపై ప్రిన్సిపల్ పోలీస్ శాఖకు సమాచారం అందించడంతో కెమెరా పెట్టిన విద్యార్థిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News January 5, 2025

షాద్‌నగర్: మద్యం అమ్మితే.. రూ.50 వేల జరిమానా

image

షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్‌నగర్ మండలం చించోడ్ గ్రామస్థులు శనివారం ప్రజల శ్రేయస్సు కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యం అమ్మితే రూ.50 వేలు, మద్యం కొంటే రూ.25 వేలు, పేకాట ఆడితే రూ.50 వేల జరిమానా విధిస్తూ ఓ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

News January 5, 2025

MBNR: పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ

image

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల బాత్ రూంలో సెల్‌ఫోన్ కెమెరా పెట్టిన ఘటనపై జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకీతో కలిసి కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపల్, విద్యార్థినులతో మాట్లాడారు. ఘటనపై ప్రిన్సిపల్ పోలీస్ శాఖకు సమాచారం అందించడంతో కెమెరా పెట్టిన విద్యార్థిని అరెస్టు చేశారు. విద్యార్థుల భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.