News April 4, 2025
MBNR: ముగ్గురిపై కేసు నమోదు

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం బిల్డింగ్‌తండా గ్రామంలో గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నిర్వహించారు. ఈ సమయంలో బందోబస్తుకు వచ్చిన ఎస్ఐ లెనిన్‌తో బిల్డింగ్‌తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కోయిలకుంట తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు. తమ విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News April 15, 2025
MBNR: విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా

MBNR పరిధిలో ఈతకు వెళ్లిన <<16098048>>ముగ్గురు యువకులు<<>> గల్లంతవగా అందులో ఒకరి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. దివిటిపల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీకి చెందిన విజయ్, అయ్యప్ప, మహమ్మద్ సమీపంలోని క్వారీ గుంతలోకి ఈత కొట్టేందుకు వెళ్లారు. ముగ్గురికి ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగిపోయారు. విజయ్ మృతదేహాన్ని అక్కడే ఉన్న కొందరు వెలికితీయగా మిగితా ఇద్దరి మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News April 15, 2025
మహబూబ్‌నగర్: మత్తు మందు ఇచ్చి.. అమ్మాయిపై అత్యాచార యత్నం!

ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. MBNR మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కోయిలకొండలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు HYD నుంచి ఒంటరిగా వచ్చింది. MBNR చేరుకున్న ఆమె ఓ యువకుడి బైక్ ఎక్కి ఊరికి వెళ్తుండగా మార్గం మధ్యలో మత్తు మందు ఇచ్చి అమ్మాయిపై అత్యాచారానికి యత్నించాడు. తప్పించుకున్న ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
News April 15, 2025
హన్వాడ: ప్రజా ప్రభుత్వం రైతుల పక్షమే: ఎమ్మెల్యే

ప్రజా ప్రభుత్వం రైతుల పక్షంగానే ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. హన్వాడ మండల కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, ప్రతి గింజను కొనడమే కాకుండా గిట్టుబాటు ధర కల్పించామని, బోనస్ అందించామన్నారు.