News November 5, 2024

MBNR: మూడు నెలల వేతనాలు విడుదల

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల వేతనాలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బకాయిలు ఉన్న ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలల జీతాలు విడుదల అయ్యాయని జిల్లా ఇంటర్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే ఖజానాకు బిల్లులు సమర్పించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. వీరికి నెలకు రూ.54,220 చొప్పున గౌరవ వేతనం ఇవ్వనన్నారు.

Similar News

News May 7, 2025

MBNR: నీట్ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

మే 4న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశపుహాల్‌లో నీట్ పరీక్ష నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల్లో నీట్ పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దివ్యాంగులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుందన్నారు.

News May 7, 2025

MBNR: సైబర్ క్రైమ్ బాధితులు గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేయాలి

image

సైబర్ క్రైమ్ బాధితులు గోల్డెన్అవర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ శనివారం ఒక ప్రకటన ద్వారా సూచించారు. సైబర్ క్రైమ్ అరికట్టేందుకు అప్రమత్తతే ప్రధాన అస్త్రం అని వెల్లడించారు. ఆన్లైన్ మనీ గేమింగ్ బెట్టింగ్ చట్ట విరుద్ధం అని వెల్లడించారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ బెట్టింగ్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా ఫ్రాడ్ లాంటి పద్ధతులను నేరగాళ్లు ఉపయోగిస్తున్నారన్నారు.

News May 7, 2025

MBNR: ‘ఒప్పంద అధ్యాపకులకు న్యాయం చేయాలి’

image

పాలమూరు యూనివర్సిటీలోని నిరవధిక సమ్మె చేస్తున్న ఒప్పంద అధ్యాపకులను మహబూబ్‌గర్ ఎంపీ డీకే అరుణ దీక్షా శిబిరానికి చేరుకొని సంఘీభావం తెలిపారు. శనివారం ఎంపీ మాట్లాడుతూ.. ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ, సమస్యల సాధనకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులు పాల్గొన్నారు.