News April 2, 2024

MBNR: మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి: మాజీ మంత్రి

image

రాష్ట్రంలో, జిల్లాలోని ముస్లీం, మైనార్టీల సంక్షేమానికి కృషి చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మసీదుల అభివృద్ధితో పాటు దర్గాలో అభివృద్ధికి కూడా అధిక శాతం నిధులు మంజూరు చేశానని గుర్తు చేశారు. మైనార్టీ గురుకులాలు, పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం కోసం 128 కోట్లు కేటాయించానని, 1 కోటి నిధులతో హజ్ హౌస్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.

Similar News

News April 20, 2025

MBNR: 22ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

image

అడ్డాకుల మండల పరిధిలోని శాఖపూర్‌లో 2002-2003 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, గురువులకు మెమెంటోలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణవర్ధన్ గౌడ్, కేశవర్ధన్ గౌడ్, రాజేష్, నరేందర్ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

News April 20, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✔SLBC: డేంజర్ జోన్‌లో ఆరుగురు✔పలుచోట్ల చలివేంద్రాలు ప్రారంభం✔MBNR:కరెంట్ షాక్‌తో స్తంభంపైనే మృతి✔గద్వాల: రేపు వక్ఫ్‌బోర్డు చట్టం సవరణకు వ్యతిరేకంగా ర్యాలీ✔ఓపెన్ SSC, INTER ఎగ్జామ్స్ ప్రారంభం✔పలుచోట్ల ఈదురు గాలుల బీభత్సం✔తడిసిన ధాన్యం కొంటాం.. భయపడొద్దు: ఎమ్మెల్యేలు✔హామీల అమలులో కాంగ్రెస్ విఫలం:BRS ✔మహమ్మదాబాద్: ఆటో, టిప్పర్ ఢీకొని ఒకరు మృతి✔PUలో ఘనంగా వీడ్కోలు సమావేశం

News April 20, 2025

రైతులను ఇబ్బంది గురి చేస్తున్నారని MBNR కలెక్టర్ ఆగ్రహం

image

ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారా అంటూ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండీడ్ మండలం వెన్నచేడు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. వేసవిలో కేంద్రాలకు వచ్చే రైతులకు నీడ, తాగునీరైనా కల్పించరా అంటూ అసహనం వ్యక్తం చేశారు.

error: Content is protected !!