News March 9, 2025
MBNR: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు

రాష్ట్రంలో మరో 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి, నారాయణపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకద్ర, గద్వాల్, జడ్చర్లలో ఈ స్కూల్స్ నిర్మిస్తున్నారు. ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్ల చొప్పున కేటాయించారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు ధీటుగా నిర్మిస్తున్నామని భట్టి తెలిపారు.
Similar News
News March 10, 2025
కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని ఉప్ని సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున బొలెరోను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. 14 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను రేవా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బల్కర్ సిద్ధి నుంచి బహ్రీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 10, 2025
మోడల్ స్కూల్స్ ప్రవేశాలు.. 20 వరకు అవకాశం

సిద్దిపేట జిల్లాలోని మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించారు. 6 నుంచి10వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని గజ్వేల్ మండలం ముత్రాజ్పల్లి మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ డా. జె.వన్నెస్స తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 10, 2025
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కోనసీమ కుర్రాడు మృతి

పి.గన్నవరం మండలం జొన్నల్లంక చెందిన సందాడి సాయి వెంకటకృష్ణ (20) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. బైక్‌పై వస్తుండగా శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని కుటుంబీకులు తెలిపారు. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మణికంఠ లక్ష్మీసాయి తీవ్రంగా గాయపడ్డాడు. ఇటీవల ఈ యువకులు ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.