News February 1, 2025
MBNR: రిజర్వాయర్‌లో పడి చిన్నారులు మృతి

ఉదండాపూర్ రిజర్వాయర్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. ఉదండాపూర్ గ్రామానికి చెందిన యాదయ్యకు ఉదండాపూర్ రిజర్వాయర్ పక్కన వ్యవసాయ పొలం ఉంది. వారి ఇద్దరు పిల్లలు భాగ్యలక్ష్మి(7), మహేష్(4) శనివారం పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ప్రాజెక్టు నీటిని గుంతలో పడడంతో మహేష్ మృతదేహం లభించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News March 7, 2025
కర్నూలు జిల్లాలో ఇద్దరు విద్యార్థుల డీబార్

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ రెండో సంవత్సర విద్యార్థులకు నేడు పార్ట్ 3లోని సబ్జెక్టుల పరీక్షలు జరిగాయి. చూచిరాతలకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను డీబార్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 20,864 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 414 మంది గైర్హాజరు అయ్యారు. బి.క్యాంప్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒకేషనల్ కళాశాలలోనే డీబార్ అయినట్లు తెలిపారు.
News March 7, 2025
సిరిసిల్ల: బ్యాంకర్ల తోడ్పాటు అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే పింఛన్లను వివిధ రుణాలకు జమ చేయకూడదన్నారు.
News March 7, 2025
ఏపీ ప్రభుత్వ అప్పులు రూ.5.19 లక్షల కోట్లు: పయ్యావుల

AP: రాష్ట్ర అప్పులపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో రాతపూర్వక సమాధానమిచ్చారు. జూన్ 12, 2024 నాటికి ఏపీ ప్రభుత్వ అప్పులు రూ.5,19,192 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీతో PSUల అప్పులు రూ.1,58,657 కోట్లు, GOVT గ్యారంటీ లేని PSU అప్పులు రూ.90,019 కోట్లు అని వెల్లడించారు. 2014 నుంచి సంవత్సరాల వారీగా అప్పుల వివరాల పీడీఎఫ్ కాపీ కోసం <