News April 6, 2025

MBNR: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందిన ఘటన నవాబుపేట మండలంలో నిన్న జరిగింది. స్థానికుల వివరాలు.. కారుకొండకి చెందిన యాదమ్మ తన కుమారుడితో కలిసి బైక్‌పై పనిమీద బయటికెళ్లి తిరిగివస్తున్నారు. షాద్‌నగర్ సమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో మహిళ తలకు తీవ్రగాయాలవటంతో అక్కడికక్కడే మృతిచెందారు.

Similar News

News April 9, 2025

GREAT: ఇంగ్లాండ్ క్రికెట్ రెండో కౌంటీకి పాలమూరు బిడ్డ ❤

image

మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్(MDCA) కృషితో ఉమ్మడి పాలమూరు జిల్లా మరికల్(M) వెంకటాపురంకి చెందిన జి.గణేశ్ ఇంగ్లాండ్ క్రికెట్ రెండో కౌంటీకి ఎంపికయ్యాడు. ఆరేళ్లపాటు ఒప్పందం కుదరడంతో ఐదు సిరీస్‌లలో 20 మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ 2వ కౌంటీలకు ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందని, భారత జట్టుకు ఆడడం తన లక్ష్యమన్నారు.

News April 9, 2025

వనపర్తి: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన మదనాపురం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అజ్జకొల్లుకి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు బాలకృష్ణ అనారోగ్యం కారణంగా ఏడాది నుంచి పనికి వెళ్లట్లేదు. దీంతో తల్లి లక్ష్మి ఆ పనికి వెళ్లేది. ఆ జీతం యువకుడి అకౌంట్లో పడేవి. తల్లి డబ్బులడగగా ఇవ్వకపోవటంతో అతడిపై గొడ్డలితో దాడి చేసింది. గాయపడిని యువకుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

News April 9, 2025

జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో జడ్చర్లకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. మండలానికి చెందిన ఆంజనేయులు భిక్షాటన చేస్తూ.. ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు అమ్ముకుంటూ జీవించేవాడు. సోమవారం అర్ధరాత్రి నందిగామ శివారులో రోడ్డు దాటుతున్న క్రమంలో వాహనం ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆంజనేయులు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదైంది.

error: Content is protected !!